పద్మారావునగర్, వెలుగు: ట్రామా కేసుల నిర్వహణలో నేటి యువ డాక్టర్లకు ప్రాక్టికల్శిక్షణతో కూడిన వర్క్ షాపులు ఎంతో ఉపయోగపడతాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సోమవారం సికింద్రాబాద్లో మెడికవర్ హాస్పిటల్స్, ఉస్మానియా మెడికల్ కాలేజీతో పాటు పలు ఆర్థోపెడిక్ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ‘పెల్విక్-ఎసిటాబ్యులమ్ అడ్వాన్స్డ్ ట్రామా కేర్’పై జాతీయ స్థాయి వర్క్షాప్ నిర్వహించారు.
సుమారు 200 మంది యువ ఆర్థోపెడిక్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమంలో క్లిష్టమైన శస్త్రచికిత్సలపై క్యాడావర్ (మృతదేహాల) ద్వారా ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన తొలి ఆరు గంటల్లో పెల్విక్ గాయాలకు అందించే చికిత్స అత్యంత కీలకమని, ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
