మనిషి తోకలొచ్చినయ్​!

మనిషి తోకలొచ్చినయ్​!

కొంతమంది క్రియేటివిటీ ‘వావ్’ అనిపించేలా ఉంటే మరికొంతమంది క్రియేటివిటీ మాత్రం నవ్వు తెప్పిస్తుంది. ‘అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి?’ అనిపిస్తుంది. ‘మిటెయిల్’ అనే కంపెనీ చేస్తున్న పని కూడా అలాంటిదే. ఈ కంపెనీ మనుషుల కోసం తోకలు తయారు చేస్తోంది. నచ్చిన సైజు, రంగు, మోడళ్లలో తోకలు కొనుక్కొని తగిలించుకోవచ్చు. అంతేకాదు ఈ తోకల్ని నచ్చినట్టుగా  కదిలించొచ్చు కూడా.యుకెలోని కొందరు రోబోటిక్ సైన్స్ స్టూడెంట్స్‌‌కు ‘మనుషులకు కూడా తోకలు ఉంటే ఎలా ఉంటుంది?’ అన్న ఐడియా వచ్చింది.

అంతే, మూడేండ్ల పాటు కష్టపడి బ్లూటూత్ తోకలను కనిపెట్టారు. ఈ తోకలను నడుముకి తగిలించుకుని మొబైల్ యాప్ ద్వారా నచ్చినట్టు కదిలించొచ్చు. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ, టైప్–సి పోర్ట్, పది గంటల పాటు పనిచేసే బ్యాటరీ ఉంటాయి. రకరకాల జంతువుల తోకల కదలికలను స్టడీ చేసి వీటి యానిమేషన్‌‌ను డిజైన్ చేశారు. యాప్ సాయంతో తోకను నచ్చినట్టు ఆడించొచ్చు. ఈ తోక ధర రూ.10 వేల నుంచి మొదలవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మిటెయిల్ కంపెనీ సైట్‌‌లో ఆర్డర్ ఇవ్వొచ్చు.