తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం

తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం

ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుంది అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. శుక్రవారం ఆయన హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ఈ గవర్నెన్స్ జాతీయ కాన్ఫరెన్స్ ను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఇంపాక్ట్ లేని టెక్నాలజీ వ్యర్థం అన్నారు. డిజిటల్ లావాదేవీల కోసం తెలంగాణ రాష్ట్రం టీ- వాలెట్ ను తీసుకొచ్చిందని తెలిపారు.  ఈ- గవర్నెన్స్ తో పాటు ఎమ్(మొబైల్) గవర్నెన్స్ కు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్న కేటీఆర్.. టీ-యాప్ తో రోజుకు 270 కు పైగా వివిధ ప్రభుత్వ సర్వీస్ లను అందజేస్తున్నామన్నారు.

ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను పలు ప్రభుత్వ శాఖల పనితీరులో భాగం చేసి సమస్యలు, సవాళ్ళకు చెక్ పెట్టామని.. స్మార్ట్ ఫోన్ తో సిటిజెన్ సర్వీసెస్ ను అందజేస్తున్నామన్నారు. ఫెస్ట్ యాప్ తో 17 సర్వీసెస్ రవాణా శాఖ ద్వారా అందజేస్తున్నామన్న ఆయన.. డిజిటల్ లిటరెసి కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందుకోసం టీ- ఫైబర్ ప్రాజెక్ట్  ద్వారా 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, 80 లక్షల గృహాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కల్పించనున్నామన్నారు.  తెలంగాణ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని... దేశంలోని పలు రాష్ట్రాలతో కలిసి తమ పరిశోధన ఫలాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు.  ఐటీఐఆర్ ను కేంద్రం తెలంగాణకు గతంలో కేటాయించి వెనక్కు తీసుకుందని.. దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని తెలిపారు.  రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లకు అదనంగా మరో రెండు ఎలక్ట్రానిక్ మనుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను తెలంగాణకు కేటాయించాలని చెప్పారు. స్పేస్ రీసెర్చ్ రంగంలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని... ఇన్ స్పేస్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కోరుతున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్. 

 

అనంతరం.. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..  టెక్నాలజీపై దేశవ్యాప్తంగా అవర్నెస్ కల్పిస్తున్నామన్నారు.  ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోనూ కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నామని..  న్యూ ఇన్నోవేషన్, న్యూ టెక్నాలజీ లో హైదరాబాద్ ఎప్పుడు ముందుంటుందన్నారు.  కోవిడ్ పాండమిక్ లో చాలా రంగాలు డిజిటలైజేషన్ మీదే ఆదరపడ్డాయన్న కేంద్ర మంత్రి.. డిజిటలైజేషన్ వల్ల వర్క్ ఈసీ అయిపోయిందన్నారు.  రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ తో పని ఎక్కవగా చేస్తున్నారని.. భారత్ ని డిజిటల్ ఇండియాగా మార్చేందుకు ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారు అని తెలిపారు.  డిజిటల్ పేమెంట్స్ వల్ల టైమ్ ని సేవ్ చేసుకోవచ్చన్న ఆయన..  పాండమిక్ లో తీసుకెచ్చిన వన్ నేషన్ వన్ రేషన్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు.  అభివృద్ధిలో రాష్ట్రాలకు హెల్తీ కాంపిటీషన్ ఉండాలని..  స్పేస్ ఏక్సిలెన్స్ సెంటర్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటామన్నారు.