బంజరాహిల్స్ లో నవ క్లినిక్ ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి

బంజరాహిల్స్ లో నవ  క్లినిక్ ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి
  • వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి

హైదరాబాద్, వెలుగు: ‘నవ స్కిన్ అండ్ బాడీ క్లినిక్’ ప్రారంభమై నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం బంజారాహిల్స్​లోని క్లినిక్​ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, విశాక ఇండస్ట్రీస్ చైర్మన్ డా. వివేక్ వెంకటస్వామి రీ లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ నవీన్, డాక్టర్ వ్రితికా నాలుగేండ్ల కిందట నవ క్లినిక్​ను ప్రారంభించి ఎంతోమందికి బెటర్ ట్రీట్​మెంట్​ను అందించారన్నారు. భవిష్యత్‌‌లోనూ వారు ఇదే విధంగా పని చేస్తూ వ్యాపారపరంగా ఎదగాలన్నారు. నవ డెర్మటాలజీ  క్లినిక్ ఫౌండర్ డాక్టర్ నవీన్ మాట్లాడుతూ.. స్కిన్, హెయిర్, నెయిల్స్​కు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా తమ క్లినిక్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నారు.

వార్షిక వేడుకలను రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ వ్రితికా గడ్డం మాట్లాడుతూ.. మొదట హైటెక్ సిటీలో చిన్న స్థలంలో తమ క్లినిక్​ను మొదలుపెట్టామన్నారు. బంజారాహిల్స్ కి మార్చిన తర్వాత క్లయింట్ల నుంచి రెస్పాన్స్ పెరిగిందన్నారు. క్లినిక్​కు వచ్చే ప్రతి క్లయింట్​కు బెటర్ ట్రీట్​మెంట్​తో పాటు పోస్ట్‌‌ కేర్​ను కూడా దగ్గరుండి చూసుకుంటామన్నారు. టోనింగ్ కోసం ఇన్​షేప్ అనే ప్రత్యేక మెషీన్​ను క్లినిక్​లో అందుబాటులో ఉంచామన్నారు.