ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలో తెలుసా...

 ఏ రోజు ఏ రంగు బట్టలు ధరించాలో తెలుసా...

ఆరోగ్యం బాగ లేకపోయినా.... ఏ పని చేస్తున్నా కలిసి రాకపోయినా.. ఏ పని తలపెట్టినా పూర్తికాకపోవడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు జ్యోతిష్యుల సలహాలు తీసుకుంటాం.  వారు మన పుట్టినతేది.. నక్షత్రం.. జాతకం ప్రకారంగా మీరు  ఏరంగు వస్తువులు వాడకూడదు.. ఏ రోజుఏ రంగు బట్టలు ధరించాలో తెలియజేస్తారు.  ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి సంబంధించినది చెబుతుంటారు.  వారంలో ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క రంగు డ్రెస్ ను ధరించనున్నారు.  ఏ రోజు , ఏ రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరమో  తెలుసుకుందాం. . . 

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల  ప్రకారం నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి  ఒక రంగు ఉంటుంది. దాని ప్రకారం రోజుకి ఒక రంగు ఉంటుందని.. దాని ప్రకారం వేర్వేరు బట్టలు ధరించాలి.జ్యోతిష్య  శాస్త్ర ప్రకారం  ఆదివారం నుండి సోమవారం వరకు ధరించాల్సిన వస్త్రాల గురించి  వివరించారు. ఒక్కో రోజు ఒక్కో రంగు   దుస్తులు ధరించడం వల్ల గ్రహాల అనుగ్రహంతో పాటు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల, ప్రతిరోజూ వేర్వేరు రంగుల బట్టలు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి వక్తులు కూడా ప్రతిరోజూ వేర్వేరు రంగుల దుస్తులను ధరించాలి.

సోమవారం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం తెల్లటి రంగు దుస్తులు ధరించడం అత్యంత శ్రేష్టం. తెలుపు రంగు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. కనుక ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

మంగళవారం: మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అంగారక గ్రహం అనుకూలంగా ఉంటుందని.. హనుమంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా జీవితంలో కలిగే ఇబ్బందులనుంచి బయటపడతారు.

బుధవారం : బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలని గ్రంధాల్లో పేర్కొనబడింది.  దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే బుధ గ్రహం వాక్కుతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఆకుపచ్చ రంగు ఈ రోజున ప్రయోజనాలను అందిస్తుంది.

గురువారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇలా చేయడం వలన బృహస్పతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో డబ్బు కొరత ఉండదు.

శుక్రవారం: శుక్రవారం లక్ష్మీ దేవి, శుక్రగ్రహానికి చెందిన రోజు. ఈ రోజున ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వ్యక్తికి లక్ష్మీదేవి , శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉంటుంది.

శనివారం: శనివారం శనీశ్వరుడికి చెందిన రోజు ఈ రోజున మీరు ఏదైనా నీలం వంటి ముదురు రంగు దుస్తులను ధరించవచ్చు. ముదురు రంగు దుస్తులు ధరించడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే మీరు శనివారం నలుపు రంగు దుస్తులను ధరించకూడదు.

ఆదివారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం గ్రహాల రాజు సూర్యుడికి చెందిన రోజు. కాబట్టి ఈ రోజున సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్య భగవానుడి తో పాటు అన్ని గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈజీగా పరిష్కరించుకుంటారు.