OTT Thriller: ఓటీటీలోకి నవీన్ చంద్ర లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Thriller: ఓటీటీలోకి నవీన్ చంద్ర లేటెస్ట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలుగు టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటించిన రీసెంట్ మూవీ ‘షో టైమ్’ (SHOW TIME). ఇందులో పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల, నరేష్, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. జులై 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే షో టైమ్ రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

శుక్రవారం జులై 25 నుంచి షో టైమ్ మూవీ సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్కి రానుంది. ఈ విషయాన్నీ సదరు ఓటీటీ సంస్థ Xలో వెల్లడించింది. “ప్రశాంతంగా ఉండే ఓ ఇల్లు ఓ డెడ్లీ మిస్టరీకి కేంద్రంగా మారితే.. షో టైమ్ జులై 25 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో పోస్టర్ రిలీజ్ చేసింది.

ఓ హత్య ఇద్దరి భార్య భర్తల జీవితాలను ఎలా మార్చేసిందనదే కథాంశంతో డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి తెరకెక్కించారు. ఈ క్రైమ్ నుంచి వాళ్లు తప్పించుకుంటారా లేదా అన్నదే షో టైమ్ మూవీ స్టోరీ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ ఉత్కంఠరేపే సీన్స్తో సాగింది. అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో దెబ్బ తీసిందంటూ నెటిజన్ల నుంచి రివ్యూలు అందుకుంది.

నిర్మాత అనిల్ సుంకర సమర్పించిన ఈ మూవీని స్కైలైన్ మూవీస్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి షో టైమ్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఎడిటర్ గా శరత్ కుమార్, టి వినోద్ రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.