OTT Thriller: ఓటీటీ ప్లాట్ఫామ్స్ను ఏలుతున్న నవీన్ చంద్ర.. మరో క్రైమ్, థ్రిల్లర్తో ఆడియన్స్ ముందుకు

OTT Thriller: ఓటీటీ ప్లాట్ఫామ్స్ను ఏలుతున్న నవీన్ చంద్ర.. మరో క్రైమ్, థ్రిల్లర్తో ఆడియన్స్ ముందుకు

హీరో నవీన్ చంద్ర వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రతినెలకో సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ క్రైమ్, థ్రిల్లర్ సినిమాలతో వస్తున్నాడు. ఇపుడా సినిమాలు తెలుగు ఆడియన్స్కే కాదు.. ప్రైమ్ ఓటీటీనే ఏలుతుంది. ఈ మధ్యకాలంలో నవీన్ చంద్ర సినిమాలన్నీ ప్రైమ్లో మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి.

ఈ క్రమంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఇన్స్పెక్టర్ రిషి, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, 28 డిగ్రీల సెల్సియస్, బ్లైండ్ స్పాట్, లెవెన్ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్తో వచ్చి ఆకట్టుకున్నాడు. లేటెస్ట్గా మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్తో ఓటీటీ ఆడియన్స్ ముందుకొచ్చాడు. అదే ‘షో టైమ్’(SHOW TIME).

‘షో టైమ్’:

నవీన్ చంద్ర, పొలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల నటించిన రీసెంట్ మూవీ ‘షో టైమ్’.ఇందులో సీనియర్ నటుడు నరేష్, రాజా రవీంద్ర ముఖ్య పాత్రలు పోషించారు. జులై 4న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే షో టైమ్ రిలీజైన 20 రోజుల్లోనే రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ (జులై 25న) ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటుగా  SUN NXTలో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. 

ఓ హత్య ఇద్దరి భార్య భర్తల జీవితాలను ఎలా మార్చేసిందనదే కథాంశంతో డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి తెరకెక్కించారు. ఈ క్రైమ్ నుంచి వాళ్లు తప్పించుకుంటారా లేదా అన్నదే షో టైమ్ మూవీ స్టోరీ. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ ఉత్కంఠరేపే సీన్స్తో సాగింది. 

అయితే, కథలో కొత్తదనం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో దెబ్బ తీసిందంటూ నెటిజన్ల నుంచి రివ్యూలు అందుకుంది.

నిర్మాత అనిల్ సుంకర సమర్పించిన ఈ మూవీని స్కైలైన్ మూవీస్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి షో టైమ్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఎడిటర్ గా శరత్ కుమార్, టి వినోద్ రాజా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.