సర్కారు బడుల్లో రీడింగ్ క్యాంపెయిన్..పోస్టర్ రిలీజ్ చేసిన నవీన్ నికోలస్

సర్కారు బడుల్లో రీడింగ్ క్యాంపెయిన్..పోస్టర్ రిలీజ్ చేసిన నవీన్ నికోలస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచే లక్ష్యంతో రీడింగ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రారంభించారు. బుధవారం స్టేట్ ఆఫీసులో సమగ్ర శిక్ష జేడీ రాజీవ్, స్టేట్ రీడ్ లీడ్ నర్సింహాచారితో కలిసి ఆయన పోస్టర్ రిలీజ్ చేశారు. ‘నా పుస్తకం నా కథ’ థీమ్ తో గురువారం నుంచి రీడింగ్ క్యాంపెయిన్ కొనసాగిస్తున్నట్టు వారు చెప్పారు. 

ప్రతి రోజూ ఒక గంట పాటు పుస్తకాలను చదివిస్తారని పేర్కొన్నారు. స్కూళ్లలోని లైబ్రరీలను బలోపేతం చేసేందుకు, వాటిని అభ్యసన కేంద్రాలుగా మార్చేందుకు దీన్ని చేపట్టినట్టు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ 8 వరకు కొనసాగుందని వివరించారు. ప్రతి స్కూల్​లో తెలుగు టీచర్​ను లైబ్రరీ టీచర్​గా నియమించనున్నారు.