AnaganagaOkaRaju: కామెడీ టైమింగ్‌‌‌‌‌‌‌‌ హీరో అప్డేట్.. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ థియేటర్స్లో నవీన్ పొలిశెట్టి

AnaganagaOkaRaju: కామెడీ టైమింగ్‌‌‌‌‌‌‌‌ హీరో అప్డేట్.. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ థియేటర్స్లో నవీన్ పొలిశెట్టి

కామెడీ టైమింగ్‌‌‌‌‌‌‌‌తో ఇచ్చిపడేసే యంగ్ హీరోస్లో నవీన్ పొలిశెట్టి ఎప్పుడు ముందుంటారు. మరోసారి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్తో ఆడియన్స్ని అలరించడానికి సిద్దమవుతున్నాడు. ప్రస్తుతం నవీన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒక రాజు’ (AOR).

లేటెస్ట్గా ఈ మూవీ ప్రోమో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. అనగనగా ఒక రాజు కొత్త ఫన్-ప్యాక్డ్ ప్రోమో పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ (సెప్టెంబర్ 25) సందర్భంగా థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నట్లు సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ తెలిపింది.

‘‘అనగనగా ఒక రాజు మూవీ ఫన్-ప్యాక్డ్ ప్రోమో ప్రపంచవ్యాప్తంగా ఓజీ తో పాటు థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించబడుతోంది! నాన్-స్టాప్ కామెడీ కోసం సమయం ఆసన్నమైంది. మీ సమీపంలోని థియేటర్లలో అనగనగా ఒక రాజు నవ్వుని మరియు OG పిచ్చిని ఉత్సాహంగా జరుపుకోండి!’’ అని మేకర్స్ ట్వీట్ చేశారు.  

ఈ సినిమాతో మారి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా 2026 జనవరి 14న మూవీ రిలీజ్ కానుంది. ఇందులో నవీన్కు జంటగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రీ వెడ్డింగ్‌‌‌‌‌‌‌‌ వీడియోకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ALSO READ : ఓజీ బాక్సాఫీస్‌ లెక్కలు.. వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంత? ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి?

అయితే, ఈ సినిమా 2025లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, అనూహ్యంగా అమెరికాలో జరిగిన యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌లో నవీన్‌‌‌‌‌‌‌‌ చేతికి గాయమవడంతో ఆలస్యమైంది. ఏదేమైనా.. సంక్రాంతి సమయంలో ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్స్‌‌‌‌‌‌‌‌కు ఉండే క్రేజ్ దృష్ట్యా నవీన్ వస్తుండటం విశేషం!!

గతంలో చూసుకుంటే.. సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చిన్న హీరోలు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి నిరాశ పరచలేదు. దానికితోడు భారీ విజయాలు కూడా నమోదు చేసుకున్నాయి. ఇక ఈసారి కామెడీ స్టార్ నవీన్ సక్సెస్ అందుకోవడం పక్కా అనే చెప్పాలి. 2026 సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన రాజా సాబ్తో పాటుగా చిరు-అనిల్ మూవీ, విజయ్ దళపతి జన నాయకుడు, రవితేజ-కిషోర్ తిరుమల మూవీస్ ఉన్నాయి.