సీఎంను కలిసిన నవీన్ యాదవ్

సీఎంను కలిసిన నవీన్ యాదవ్
  • జూబ్లీహిల్స్ లో 70వేల మెజార్టీతో గెలుస్తానని ధీమా

జూబ్లీహిల్స్/హైదరాబాద్​ సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నవీన్ యాదవ్.. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ కు సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. 

బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి. సానుభూతితో ఓట్లు పడే అవకాశం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 

వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా జూబ్లీహిల్స్ లో విజయ ఢంకా మోగిస్తా’’  అని పేర్కొన్నారు.  జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తున్నదని తెలిపిన ఆయన.. రూ.150 కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేసి రూ.80 కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచి జనాలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.  తాను 70వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తానని నవీన్ ధీమా వ్యక్తం చేశారు.