
నవీపేట్, వెలుగు : మండలం లోని మహిళా సంఘలకు రూ.2 కోట్ల బ్యాంక్ రుణాలను లీడ్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చౌహన్ అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఇచ్చిన రుణాలతో మహిళలు ఆర్థికంగా ఎదుగాలని సూచించారు.
సభ్యులకు పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై ఇన్సూరెన్స్ లను చేయించడం ఉత్తమం అన్నారు. కార్యక్రమంలో ఏపీఎం భూమేశ్గౌడ్, బ్రాంచ్ మేనేజర్ దినేశ్ సప్కాల్, పీల్డ్ ఆఫీసర్ విశాల్ పాల్గొన్నారు.