నేడు పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన 

నేడు పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన 

పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరనేది నేడు తేలనుంది. తమ నాయకుడు రాహుల్ గాంధీ తీసుకునే నిర్ణయానికి  అందరూ కట్టుబడి ఉంటారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామని సిద్ధూ ట్వీట్ చేశారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం సిద్దూ, చన్నీ తీవ్రంగా పోటీ పడుతున్నారు. లూథియాలోనే జరిగిన వర్చువల్ ర్యాలీలో రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారని కాంగ్రెస్ పంజాబ్ ఇన్ ఛార్జ్ హరీష్ చౌదరి గతంలో ప్రకటించారు. ముఖ్య మంత్రి చరణ్ జిత్ సింగ్, సిద్దూ కంటే ముందు వరుసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఐవీఆర్ ఫోన్  కాల్స్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా మెజార్టీ ప్రజలు చన్నీకే మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సిద్ధూ గత కొన్ని రోజులుగా చన్నీపై విమర్శలు చేస్తున్నారు. క్లీన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వారినే అభ్యర్థిగా ఎన్నుకోవాలని ఇటీవల ప్రస్తావించారు.

మరిన్ని వార్తల కోసం

లతా మంగేష్కర్ మృతిపై పలువురు సంతాపం

సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత