నవోదయ ఎంట్రన్స్​ టెస్ట్: ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్​

నవోదయ ఎంట్రన్స్​ టెస్ట్: ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్​

జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (జేఎన్వీఎస్టీ–2020) ప్రకటనను నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) విడుదల చేసింది. దీని ద్వారా దేశ‌‌‌‌వ్యాప్తంగా ఉన్న 636 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2020–21 విద్యా సంవత్సరానికి ఆరోతరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఉచిత విద్య అందిస్తుండటంతో టెస్ట్కు తీవ్ర పోటీ ఉంటుంది. నేపథ్యంలో నోటిఫికేషన్ వివరాలు, పరీక్షా విధానం, సిలబస్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ మీ కోసం..

 

జేఎన్​వీఎస్​టీ ద్వారా ఒక్కో విద్యాలయలో ఆరో తరగతిలో 80 మంది విద్యార్థులకు అడ్మిషన్​​ కల్పిస్తారు. పన్నెండో తరగతి వరకు ఉచిత విద్య, హాస్టల్​ ఫెసిలిటీ, భోజన సదుపాయం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్ అందిస్తారు. ఒక విద్యార్థి ఒక ఏడాది మాత్రమే పరీక్ష రాసేందుకు అర్హులు. 75 శాతం సీట్లను గ్రామీణ విద్యార్థులకు కేటాయించారు. ఇందుకు గాను 3 నుంచి 5వ తరగతి వరకు గ్రామీణ స్కూళ్లలో చదివుండాలి. ఓపెన్​ స్కూలింగ్​లో చదివిన వారు గ్రామీణ ప్రాంతాలకు చెందినట్లు తెలిపే రెసిడెన్స్​ సర్టిఫికెట్​ ప్రొవైడ్​ చేయాల్సి ఉంటుంది. 25 శాతం సీట్లకు పట్టణ స్కూళ్లలో చదివిన వారు పోటీ వడొచ్చు. బాలికలకు 1/3వ వంతు సీట్లు రిజర్వ్​ చేశారు. మన రాష్ర్టంలో 9, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో 15 నవోదయ విద్యాలయాలున్నాయి.

సెలెక్షన్ ప్రాసెస్

ఎంట్రన్స్​ టెస్ట్​లో మెరిట్ సాధించిన వారికి అడ్మిషన్లు కల్పిస్తారు. రాత పరీక్షలో మెంటల్​ ఎబిలిటీ టెస్ట్​, ఆరిథ్​మెటిక్, లాంగ్వేజ్​ టెస్ట్​ల నుంచి 100 మార్కులకు 80 ప్రశ్నలిస్తారు. ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లిష్​లో ప్రింట్​ చేస్తారు. టెస్ట్​ డ్యురేషన్​  రెండు గంటలు. నెగెటివ్​ మార్కులు లేవు. కొన్ని రాష్ర్టాలకు జనవరి, మరి కొన్ని రాష్ర్టాల్లో ఏప్రిల్​ లో పరీక్ష నిర్వహిస్తారు.

సిలబస్ & టిప్స్​ మెంటల్​ ఎబిలిటీ టెస్ట్​

ఈ విభాగంలో ప్రశ్నలు పూర్తిగా నాన్​ వర్బల్​ బేస్డ్. అంటే కేవలం చిత్రాలు, బొమ్మల రూపంలోనే క్వశ్చన్స్ ఇస్తారు. Odd-Man Out, Figure Matching, Pattern Completion, Figure Series Completion, Analogy, Geometrical Figure Completion (Triangle, Square, Circle), Mirror Imaging, Punched Hold Pattern Fol ding / Unfolding, Space Visualisation, Embedded Figure వంటి నాన్​ వర్బల్​ రీజనింగ్​/మెంటల్​ ఎబిలిటీ ప్రశ్నలొస్తాయి. ఒక్కో టాపిక్​లో 3 నుంచి గరిష్టంగా 6 క్వశ్చన్స్​ అడుగుతారు. ప్రీవియస్​ ఎగ్జామ్స్​లో వచ్చిన మోడల్స్ రీపీట్ అవుతాయి కాబట్టి వాటిని పక్కాగా ప్రిపేరయితే దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు.

ఆరిథ్​మెటిక్

ఇందులో కాన్సెప్ట్​ను అర్థం చేసుకొని సమస్యకు దానిని అప్లై చేసే సామర్థ్యాన్ని పరీక్షించేలా క్వశ్చన్స్ అడుగుతారు. నంబర్ సిస్టమ్, ఫండమెంటల్​ ఆపరేషన్స్, ఫ్రాక్షనల్​ నంబర్స్, ఫ్యాక్టర్స్​ – వాటి ప్రాపర్టీస్​, ఎల్​సీఎం అండ్​ హెచ్​సీఎఫ్​, డెసిమల్స్, కన్వర్షన్​ ఆఫ్​ ఫ్యాక్టర్స్​ టు డెసిమల్స్​, మెజర్​మెంట్​ (లెన్త్​, మాస్​, కెపాసిటీ, టైమ్​, మనీ), డిస్టెన్స్​, టైమ్​ అండ్​ స్పీడ్​, అప్రాక్సిమేషన్స్, సింప్లిఫికేషన్స్, పర్సెంటేజస్​, ప్రాఫిట్​ అండ్​ లాస్​, సింపుల్​ ఇంట్రెస్ట్​, పెరిమీటర్​, ఏరియా అండ్​ వాల్యూమ్​ అనే 15 టాపిక్స్​ నుంచే క్వశ్చన్ వస్తాయి.

మాదిరి ప్రశ్నలు

  1. What is the prime factorization of 1000?
  2. a) 10 x 10 x 10
  3. b) 2 x 5 x 5 x 10
  4. c) 2 x 2 x 2 x5 x 5
  5. d) 2 x 2x 2 x 5 x5 x 5
  6. What is the average of first four odd numbers?
  7. a) 5 b) 4       c) 5         d) 16
  8. A 1 km. long goods train is running at speed of 1 km per 3 minutes .The time taken by this train to pass through 2 km. long tunnel is:
  9. a) 1 minute b) 3 minutes
  10. c) 6 minutes d) 9 minutes

లాంగ్వేజ్​ టెస్ట్​

అభ్యర్థి ఒక విషయాన్ని చదివి ఎలా అర్థం చేసుకున్నాడో తెలుసుకునేందుకు ఉద్దేశించిన టెస్ట్​ ఇది. ఇందులో నాలుగు ప్యాసేజ్​లిస్తారు. విద్యార్థి కాంప్రెహెన్సివ్​ సామర్థ్యాన్ని అంచనా వేసేలా ప్రతి ప్యాసేజ్​ కింద 5 ప్రశ్నలుంటాయి.

పోటీ  ఎక్కువే

నవోదయ విద్యాలయాల్లో చదువు పూర్తి ఉచితం. విద్యార్థి ఆల్​రౌండ్​  డెవలప్​మెంట్​కు ఉపయోగపడే వాతావరణం, టీచింగ్​ విధానం వీటి ప్రత్యేకత. సువిశాల క్యాంపస్​లో హాస్టల్​ ఫెసిలిటీతో పాటు అధునిక సౌకర్యాలున్న క్లాస్‌‌‌‌రూమ్స్​, అనుభవం కలిగిన టీచర్లు  ఇక్కడ ఉంటారు. చదువుతో పాటు ఫిజికల్​ ఎడ్యుకేషన్​, కల్చరల్ యాక్టివిటీస్​, స్పోర్ట్స్, ఎన్​సీసీ, యోగా, ఆర్ట్​ కాంపిటీషన్స్ తదితర యాక్టివిటీస్‌‌‌‌తో స్టూడెంట్స్​ ఎక్సెల్​ అవడానికి స్కోప్​ ఎక్కువ. సీబీఎస్​ఈ సిలబస్. ఎనిమిదో  తరగతి వరకు ఇంగ్లిష్​, ప్రాంతీయ భాషలో టీచ్​ చేస్తారు. 9 నుంచి మ్యాథ్స్​, సైన్స్​లకు ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​కు హిందీలో బోధన ఉంటుంది. వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్

 

టెస్ట్​ ప్యాటర్న్​

సబ్జెక్ట్​             ప్రశ్నలు      మార్క్స్​

మెంటల్​ ఎబిలిటీ        40  50

ఆరిథ్​మెటిక్​     20      25

లాంగ్వేజ్​         20      25

మొత్తం           80      100

 

 నోటిఫికేషన్​

అర్హత‌‌‌‌: ప్రస్తుతం ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ‌‌‌‌శాల‌‌‌‌లో ఐదో త‌‌‌‌ర‌‌‌‌గ‌‌‌‌తి చ‌‌‌‌దువుతూ ఉండాలి. 2019 సెప్టెంబర్​ 15లోపు ఐదోతరగతిలో ప్రవేశం పొందని వారు అనర్హులు. విద్యార్థి చదువుతున్న జిల్లాలోని నవోదయలో మాత్రమే అడ్మిషన్ కల్పిస్తారు.

వ‌‌‌‌య‌‌‌‌సు:  2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్​ 30 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: 

ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి చదువుతున్న స్కూల్​ ప్రిన్సిపల్​ చేత అటెస్ట్​ చేయించి (తల్లిదండ్రుల సంతకం తప్పనిసరి) వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయాలి.

చివ‌‌‌‌రితేది: 2019 సెప్టెంబర్​ 15

ప‌‌‌‌రీక్షతేది: 2020 జ‌‌‌‌న‌‌‌‌వ‌‌‌‌రి 11

వివరాలకు: www.nvsadmissionclas ssix.in, www.navodaya.gov.in