మీ ఇష్టం.. భారత్‎తో యుద్ధం చేస్తే మీకే నష్టం: పాక్‎కు మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరిక

మీ ఇష్టం.. భారత్‎తో యుద్ధం చేస్తే మీకే నష్టం: పాక్‎కు మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరిక

భారత్ తో యుద్ధం వస్తే పాక్‎కు పరేషాన్! 

= విదేశీమారకం నిల్వలు తగ్గిపోతయ్
= ఆ దేశం ఆర్థికంగా చితికిపోతుంది
= భారత్ పై యుద్ధం ప్రభావం తక్కువే
= మూడీస్ రేటింగ్స్ సంస్థ హెచ్చరిక

ఢిల్లీ: భారత దేశంతో యుద్ధం వస్తే పాకిస్తాన్ ఆర్థిక పరమైన చిక్కుల్లో పడుతుందని, అదే సమయంలో భారత దేశంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని మూడీస్ రేటింగ్ సంస్థ తెలిపింది. దీని ప్రభావం పాకిస్తాన్‎పై దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. పాకిస్తాన్‎కు రుణాలు రావడం కూడా కష్టంగా మారుతుందని తెలిపింది. పాకిస్తాన్‌కు బయటి నుంచి ఆర్థిక సహాయం అందడంలో ఇబ్బందులు తలెత్తవచ్చని తెలిపారు. దీనివల్ల విదేశీ మారక నిల్వలు తగ్గిపోవచ్చని తెలిపారు.

ఇది పాకిస్తాన్ చెల్లించాల్సిన రుణ చెల్లింపులకు అవసరమైన కనీస స్థాయి కంటే చాలా తక్కువని మూడీస్ పేర్కొంది. ఈ ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే ఐఎంఎఫ్ తో జరుగుతున్న సంస్కరణలపై ప్రభావం పడుతుందని, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపింది. దీనివల్ల పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. 

►ALSO READ | ఈ సారి నిర్మలమ్మ వంతు.. పాక్‎ను మరో దెబ్బ కొట్టేందుకు ఇండియా భారీ స్కెచ్..!

విదేశీ రుణాలు చెల్లించే సామర్థ్యం, ఆర్థిక సహాయం పొందే అవకాశాలు తగ్గుతాయని తెలిపింది. అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పేర్కొంది. ఎందుకంటే భారత్‌కు పాకిస్తాన్‌తో వాణిజ్యం చాలా తక్కువని, ఉద్రిక్తతలు పెరిగితే రక్షణ వ్యయం పెరగవచ్చునని పేర్కొంది. దీని వల్ల భారత ద్రవ్యలోటు తగ్గించే ప్రక్రియ మందగించవచ్చని అభిప్రాయపడింది.