ఇవి డబ్బాలు కాదు బస్సులు..అదిరిపోయే మేడారం జాతర డ్రోన్ వీడియో

ఇవి డబ్బాలు కాదు బస్సులు..అదిరిపోయే మేడారం జాతర డ్రోన్ వీడియో

మేడారం జాతర ఇవాళ (జనవరి 31న)చివరి అంకానికి చేరనుంది. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు ఇవాళ(శనివారం) తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర ముగియనున్నది.. ఈ క్రమంలో కనుచూపు మేర ఎటుచూసినా జన ప్రవాహం.. ఇసుకేస్తే రాలనంత మంది భక్తులతో మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శనానికి జనం పోటెత్తారు.

మేడారం జాతర కోసం  తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 4 వేల బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  మేడారంలో ఆర్టీసీ బస్సులు పార్కింగ్ చేసిన డ్రోన్  వీడియో ఆకట్టుకుంటోంది. జాతరలో వందలాది ఆర్టీసీ బస్సులు డబ్బాల మాదిరి కనిపిస్తున్నాయి.  ఈ డ్రోన్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

దర్శనం అనంతరం  తాడ్వాయి–మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు  కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నాలుగురోజుల  జాతరలో పాల్గొన్న జనం.. మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం ప్రారంభించారు.