V6 News

హైదరాబాద్లో నాక్సియన్ ప్లాంటు.. రూ.200 కోట్లతో ఏర్పాటు

హైదరాబాద్లో నాక్సియన్ ప్లాంటు.. రూ.200 కోట్లతో ఏర్పాటు

హైదరాబాద్​, వెలుగు: సోడియం- అయాన్ బ్యాటరీలు తయారు చేసే నాక్సియన్ ఎనర్జీ హైదరాబాద్​లో కొత్త  ప్లాంట్‌‌‌‌ కోసం రూ.200 కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించింది. 2026 డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయని తెలిపింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు కోయంబత్తూరులో ప్లాంట్ ఉంది. కంపెనీ సీఈఓ అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న డిమాండ్‌‌‌‌ను తీర్చడానికి హైదరాబాద్​లో అసెంబ్లీ ప్లాంట్, సెల్ తయారీ సదుపాయాన్ని నిర్మిస్తామని తెలిపారు. 

కంపెనీ సోడియం- అయాన్ ఆధారిత  ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్​ను హైదరాబాద్​లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ కొత్త ఆల్- ఇన్- వన్ ఎనర్జీ ప్లాట్‌‌‌‌ఫారమ్ బ్యాటరీ, ఇన్వర్టర్, సోలార్ ఎంపీపీటీని అనుసంధానిస్తుందని తెలిపారు.  నివాస, వాణిజ్య, పారిశ్రామిక, రక్షణ రంగాల కరెంటు అవసరాలను తీర్చుతుందని పేర్కొన్నారు.  ఇవి 3.5 కిలోవాట్, 5 కిలోవాట్, 10 కిలోవాట్ల మోడల్స్‌‌‌‌లో, ఇన్​బిల్ట్​ బ్యాటరీలతో లభిస్తాయి.