బీఈడీ కౌన్సెలింగ్ లో అన్యాయం

బీఈడీ కౌన్సెలింగ్ లో అన్యాయం

ఆర్మూర్, వెలుగు: హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్​లో జరిగిన బీఈడీ కౌన్సెలింగ్​లో సుమారు 20 మంది ఆదివాసి నాయకపోడ్ స్టూడెంట్స్​కు అన్యాయం జరిగిందని నాయకపోడ్​ సేవా సంఘం ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ భీమన్న కల్యాణ మండపంలో ఆదివాసి  సేవా సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గాండ్ల రాంచందర్, ఉద్యోగ సేవా సంఘం అధ్యక్షుడు పుట్ట రాజేశ్వర్ మాట్లాడారు.  

ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో కుల ఆచారాలు  సంప్రదాయాలు, తాత ముత్తాతల ఇంటి పేర్లు,  గోత్రాల గురించి అడిగి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, రాష్ట్ర  గిరిజన శాఖ మంత్రి అడ్లురి లక్మణ్,  జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్క లను కలిసి సమస్యను వివరిస్తామన్నారు.  సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బండారు భోజన్న, ఉద్యోగుల సేవా సంఘం ముఖ్య సలహాదారుడు సాయన్న, నాయకులు గంగ సాయన్న, పవన్, కొసేడుగు రవి, కొండ్రు నవీన్, అంజయ్య, మన్నే సాగర్ తదితరులు పాల్గొన్నారు.