కెరీర్ ప్రారంభంలోనే చిన్న చిత్రాలతో పెద్ద విజయాలను అందుకుంది నయన్ సారిక. ‘గం గం గణేషా’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె... గత ఏడాది ఆయ్, క లాంటి సూపర్ సక్సెస్‌లను అందుకుంది. మోహన్ లాల్ సినిమా ‘వృషభ’తో మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, నవంబర్‌లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. అలాగే సంగీత్ శోభన్‌కు జంటగా నిహారిక కొణిదెల నిర్మాణంలో ఓ సినిమా చేస్తోంది. ఇక తాజాగా హీరో శ్రీవిష్ణుకి జంటగా అవకాశం అందుకుంది నయన్ సారిక.
కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జి. సుమంత్ నాయుడు నిర్మిస్తున్నారు. గురువారం నయన్ సారిక బర్త్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తూ స్పెషల్ వీడియోని విడుదల చేశారు. ఒంగోలు నేపథ్యంలో సాగే ఈ ఎంటర్‌టైనర్‌లో శ్రీ విష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.
సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని ఇతర పాత్రలు పోషిస్తున్నారు. శ్రీరామ్ డీవోపీ కాగా రధన్ సంగీతం అందిస్తున్నాడు.
