తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల

తాళి కట్టు శుభవేళ.. మెడలో కళ్యాణమాల

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ల వివాహం ఘనంగా జరిగింది. తమిళనాడులోని మహాబలిపురంలో  మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది ఈ ప్రేమజంట. ఏడడుగులు వేసి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ కపుల్ ను విష్ చేస్తూ సోషల్ మీడియా అంతటా నెటిజన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది సంప్రదాయ పద్ధతిలో జరిగిన  వీరి వివాహ వేడుకకు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌, ప్రముఖ నిర్మాత బోణీ కపూర్‌, దర్శకుడు అట్లీ, రాధికా శరత్‌ కుమార్‌, విజయ్‌ సేతుపతి, కార్తి, పలువురు రాజకీయ ప్రముఖులు సైతం హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో నయన్ - విఘ్నేష్ లకు సంబంధించిన కొన్ని వెడ్డింగ్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా చూడకపోతే మీరూ ఓ లుక్కేయండి.