
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు. వారం రోజుల కిందట హైదరాబాద్ లో సుశాంత్ సన్నిహితుడైన సిద్ధార్థ్ పితానిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇవాళ(బుధవారం) సుశాంత్ కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ ఖాన్ ను ముంబైలోని బాంద్రాలో అరెస్ట్ చేశారు. అతడు పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సప్లై చేసేవాడని గుర్తించారు.
ప్రస్తుతం ఆ ఇద్దరినీ విచారిస్తున్నామని.. ఆ వివరాలను త్వరలోనే తెలుపుతామన్నారు NCB జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే. హరీశ్ ఖాన్ ఫోన్ లో, వాట్సాప్ చాటింగుల్లో.. అతనికి డ్రగ్స్ సరఫరాదారులతో లింకులున్నట్టు తేలడంతోనే అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.