
మహరాష్ట్రలో డ్రగ్స్ కలకలం కొనసాగుతుంది. తాజాగా.. ముంబైలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ముఠాను NCB పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుల నుంచి రూ. 4 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ...సహర్ కార్గో కాంప్లెక్స్‌లో 700 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న NCB అధికారులు విచారణ చేపట్టారు.