కెప్టెన్​ అన్షుమాన్​ భార్యపై అసభ్య కామెంట్స్..​ఎన్​సీడబ్ల్యూ సీరియస్​

కెప్టెన్​ అన్షుమాన్​ భార్యపై అసభ్య కామెంట్స్..​ఎన్​సీడబ్ల్యూ సీరియస్​
  • ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్​చేయాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశం=
  • మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ లేఖ

న్యూఢిల్లీ :  కీర్తిచక్ర, అమర సైనికుడు కెప్టెన్​అన్షుమాన్​ సింగ్​ భార్య స్మృతి ఫోటో కింద సోషల్​ మీడియాలో అసభ్యకర కామెంట్స్​చేసిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్​సీడబ్ల్యూ) సీరియస్​ అయ్యింది. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్​ చేసి, కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు  బుధవారం ఢిల్లీ పోలీస్​ కమిషనర్​ సంజయ్​అరోరాకు ఓ లేఖ రాసింది.

సోషల్​ మీడియాలో స్మృతి ఫొటో కింద ఢిల్లీకి చెందిన అహ్మద్​ కే అనే వ్యక్తి అసభ్యకరంగా కామెంట్​ పెట్టినట్టు తాము గుర్తించామని ఎన్​సీడబ్ల్యూ పేర్కొంది. ఈ కామెంట్​ భారత న్యాయ సంహిత, 2023లోని సెక్షన్​ 79, ఐటీ యాక్ట్​లోని సెక్షన్​ 79 కింద ఉల్లంఘన కింద వస్తుందని వెల్లడించింది. ఈ వ్యవహారంలో తీసుకున్న చర్యలపై మూడు రోజుల్లో తమకు నివేదిక సమర్పించాలన ఆదేశించింది.