
ముంబై: భారత్-ఆస్ట్రేలియాతో మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 3 వన్డేల సిరీస్ ను గెలుస్తామని తెలిపాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ఈ సిరీస్ ను ఆసిస్ 2-1తేడాతో గెలుస్తుందని కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. సొంతగడ్డపై గెలిచే అవకాశాన్ని భారత్ కు ఇవ్వమని తెలిపాడు. భారత్ గడ్డపై గతేడాది జరిగిన వన్డే సిరీస్ లో తమదే పైచేయి అయ్యిందని, ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందన్నాడు.
టీమిండియాకు ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇవ్వబోమన్న రీకీ.. వన్డే వరల్డ్ కప్ దగ్గర్నుంచీ ఆసీస్ పుంజుకుందన్నాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను వైట్ వైష్ చేసిన ఆసీస్.. ఇప్పుడు భారత్ పై కూడా అదే జోరును రిపీట్ చేయడానికి సిద్ధమైందన్నాడు. ట్వీటర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో భాగంగా భారత్ పై ఆసీస్ గెలుస్తుందా అనే ప్రశ్నకు పాంటింగ్ ఈ విధంగా స్పందించాడు. మరోవైపు సొంతగడ్డపై గెలిచి పరువు నిలబెట్టకోవాలని భారత్ కాన్ఫిడెన్స్ గా ప్రాక్టీస్ షురూ చేసింది. మరి చూడాలి రికీ పాంటింగ్ జోష్యం నిజమౌతుందో లేదో.
ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఫస్ట్ వన్డే రేపు ముంబై వేదికగా మధ్యాహ్నం 1-30 గంటలకు స్టార్ట్ కానుంది.
See Also : మోడీజీ.. మఠంలో రాజకీయాలేంటి? రామకృష్ణ మఠం ప్రతినిధులు