4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు 5 గ్యారంటీల్లో భాగంగాఅమలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఈ స్కీంను మొదలుపెట్టింది. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కూడా అమలు చేస్తోంది. ఈ నాలుగు రాష్ట్రా ల్లోనూ ఇండియా కూటమిలోని పార్టీలే అధికారంలో ఉన్నాయి. 

కానీ, ఎన్డీఏ కూటమిలోని పార్టీలు, బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఈ స్కీం లేదు. అయితే, ఏపీలో అధికారంలోకి వస్తే తాము కూడా ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. తాజాగా ఫ్రీ బస్సు స్కీంకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఏపీలో ఆ కూటమి అధికారంలోకి వస్తే ఈ స్కీంను అమలు చేస్తారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.