విమాన సర్వీసుల ప్రారంభం ఇప్పుడే వద్దు

విమాన సర్వీసుల ప్రారంభం ఇప్పుడే వద్దు
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ థాక్రే
  • మరింత సమయం కావాలని కేంద్ర మంత్రికి వినతి

ముంబై: రోజురోజుకు కరోనా విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో రాష్ట్రంలో విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించడం మంచిది కాదని, అందుకు ఇంకొద్ది రోజులు సమయం వేచి చూడటం అవసరమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. ‘‘విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మాట్లాడాను. రాష్ట్రంలో విమాన సర్వీసులు ప్రారంభానికి ఇంకొంచెం సమయం కావాలని కోరాను ”అని ఉద్ధవ్ థాక్రే ఆదివారం ప్రెస్ మీట్​లో అన్నారు. మహారాష్ట్రలో కరోనా కేసులు మే చివరి నాటికి 1.15 లక్షలకు చేరుకుంటాయని అంచనా వేసినప్పటికీ.. ప్రజల సహకారంతో చాలావరకు కంట్రోల్ చేశామని చెప్పారు. వైరస్ కట్టడి రాబోయే రోజుల్లో మరింత సవాలుతో కూడుకున్నదని అన్నారు. ఈ నెలాఖరుతోనే రాష్ట్రంలో లాక్​డౌన్ ముగిసేలా లేదని పరోక్షంగా చెప్పిన థాక్రే.. ఇప్పటివరకు కరోనా కట్టడి చర్యలకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తామని, ఈ నెలాఖరు నాటికి 14 వేల పడకలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కరోనా కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర ఫస్టు ప్లేస్ లో ఉంది. ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో 47,190 కరోనా నమోదు కాగా.. మరణాలు 1,577 కు పెరిగాయి, 13,404 మంది కరోనా పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు.