వ్యాక్సిన్ వచ్చినా మాస్కులు కట్టుకోవాల్సిందే

వ్యాక్సిన్ వచ్చినా మాస్కులు కట్టుకోవాల్సిందే

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే అంతమయ్యేలా లేదు. కొన్నాళ్లు వైరస్ ప్రభావం తగ్గినట్లు అనిపించినా మళ్లీ విజృంభిస్తోంది. యూరప్‌‌తోపాటు ఆసియా దేశాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వచ్చినా కరోనా ప్రభావం చాన్నాళ్లు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే వ్యాక్సినేషన్ తీసుకున్నాక కూడా కొన్నాళ్ల వరకు మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) చీఫ్, ప్రొఫెసర్ బలరాం భార్గవ అన్నారు.

‘వచ్చే ఏడాది జూలై నాటికి 30 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మిగతా టార్గెట్స్‌‌ను తర్వాత నిర్దేశించుకుంటాం. ఇండియా తన కోసమే గాక అభివృద్ధి చెందుతున్న 60 శాతం దేశాలకు టీకాను రూపొందిస్తోంది. దేశంలో 24 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, 19 సంస్థలు వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. మాస్క్ అనేది ఫ్యాబ్రిక్ మాస్క్ లాంటిది. కరో్నా వ్యాప్తిని నిరోధించడంలో మాస్కులు చాలా ఉపయోగపడ్డాయి. కరోనా వ్యాక్సిన్ మీద మేం పని చేస్తున్నాం. అయితే కరో్నాను వ్యాక్సిన్‌‌‌తో పూర్తిగా అడ్డుకోలేం. హెల్త్, సేఫ్టీ ప్రోటోకాల్స్‌‌ను తప్పకుండా పాటించాల్సిందే’ అని భార్గవ పేర్కొన్నారు.