మరో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం తప్పింది. అమెరికా నుంచి ఇండియా వస్తున్న ఫ్లైట్ మంగోలియాలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా డైవర్ట్ చేసినట్లు ఎయిర్ ఇండియా స్పోక్స్ పర్సన్ తెలిపారు.
నవంబర్ 02 న AI174 విమానం.. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. టెక్నికల్ సమస్యతో మంగోలియాలోని ఉలాన్ బాతార్ కు డైవర్ట్ చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉలాన్ బాతార్ లో విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని.. సమస్యకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్యాసెంజర్స్ సేఫ్టీ కోసం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో విమానంలో ఎంత మంది ఉన్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.
