
పటాన్చెరు, వెలుగు: మెదక్ ఎంపీగా పనిచేసిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి బాటలు వేస్తే సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రగతిని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారని కాంగ్రెస్ సీనియర్‌నేత నీలం మధు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని జహీరాబాద్ లో సీఎం ఆవిష్కరించిన బసవేశ్వర విగ్రహం, కేంద్రీయ విద్యాలయం, పెట్రోల్‌బంక్ ప్రారంభోత్సవంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్‌నాయకులతో కలిసి మధు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పాలనను గుర్తు చేస్తూ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆనాడు ఇందిరమ్మ హయంలో ఉమ్మడి మెదక్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సభ్యులు, కాంగ్రెస్ నేతలు పాల్గొనారు.