నిలోఫర్ లో పేషెంట్ అటెండెంట్ పై దాడి..సెక్యూరిటీ గార్డ్ డిస్మిస్

నిలోఫర్ లో పేషెంట్ అటెండెంట్ పై దాడి..సెక్యూరిటీ గార్డ్ డిస్మిస్

మెహిదీపట్నం, వెలుగు: నిలోఫర్ హాస్పిటల్లో పేషెంట్ అటెండెంట్​పై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న ఒక పేషెంట్ వెంట వచ్చిన మహిళా అటెండెంట్​​కు, ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది హీరాకు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదిరి ఇద్దరు ఘర్షణ పడటంతో సెక్యూరిటీ సిబ్బంది అటెండెంట్​​పై దాడికి దిగారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. దాడికి పాల్పడిన సదరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిని రెండు రోజుల క్రితమే విధుల్లో నుంచి తొలగించినట్లు ఆర్‌‌‌‌ఎంఓ డాక్టర్ ఆనంద్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే సదరు సెక్యూరిటీ ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.