
దోహా: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నేతృత్వంలోని నలుగురు ఇండియన్ అథ్లెట్లు.. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగనున్నారు. ఈ నెల 16న దోహాలో ఈ ఈవెంట్ జరగనుంది. 2023లో ఇక్కడ టైటిల్ నెగ్గిన నీరజ్ (88.67 మీటర్లు).. 2024లో రెండో ప్లేస్ (88.63 మీటర్లు)లో నిలిచాడు.
నీరజ్‌తో పాటు కిశోర్ జెనా కూడా జావెలిన్ పోటీల్లో పాల్గొననున్నాడు. 2024లో జెనా 76.31 మీటర్ల దూరంతో 9వ స్థానంలో నిలిచాడు. మెన్స్ 5 వేల మీటర్ల పరుగులో గుల్వీర్ సింగ్ (ఇండియా) తొలిసారి డైమండ్ లీగ్‌లో బరిలోకి దిగుతున్నాడు. విమెన్స్ 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో పారుల్ చౌదరీ పతకంపై కన్నేసింది. ఈ ఇద్దరు నేషనల్ రికార్డు హోల్డర్స్‌గా ఉన్నారు.