ఒలంపిక్స్‌కి అర్హత సాధించిన నీరజ్ చోప్రా

ఒలంపిక్స్‌కి అర్హత సాధించిన నీరజ్ చోప్రా

స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మంగళవారం అథ్లెటిక్స్ సెంట్రల్ నార్త్ ఈస్ట్‌లో నీరజ్ జావెలిన్‌ను 87.86 మీటర్లు విసిరి ఈ అర్హత సాధించాడు. ఒలంపిక్స్‌లో అర్హత సాధించాలంటే కనీసం 85 మీటర్లు విసరాలి. దాన్ని దాటి నీరజ్ జావెలిన్‌ను విసిరాడు. నీరజ్ మోచేతి గాయం నుండి కోలుకున్న తర్వాత ఈ పోటీలలో పాల్గొన్నాడు. గాయం కారణంగా 22 ఏళ్ల నీరజ్ 2019 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

‘నేను ఒలంపిక్స్ అర్హత పోటీలలో అర్హత సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నేను మొదటి మూడు త్రోలు అన్నీ 80 మీటర్లకు పైనే విసిరాను. ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకొని నాల్గవ ప్రయత్నంలో గట్టిగా విసిరాను. అది 87 మీటర్లకు చేరింది ’అని ఆసియా గేమ్స్ మరియు కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత నీరజ్ అన్నారు. ఈ అర్హత పోటీలలో మరో ఇండియన్ ప్లేయర్ రోహిత్ యాదవ్ 77.61 మీటర్లు విసిరి అర్హత సాధించలేకపోయాడు.

నీరజ్‌కు 2019 మేలో శస్త్రచికిత్స జరిగింది. 2019 చివర్లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పోటీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, AFI క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అది కుదరలేదు. నీరజ్ గాయం కారణంగా IAAF ప్రపంచ ఛాంపియన్‌షిప్, డైమండ్ లీగ్ మరియు ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు దూరమయ్యాడు. నీరజ్ చివరిసారిగా 2018 జకార్తా ఆసియా క్రీడలలో పాల్గొన్నాడు. అక్కడ 88.06 మీటర్ల జాతీయ రికార్డుతో స్వర్ణ పతకం సాధించాడు.

For More News..

ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా 7,423 బాంబుల దాడి

నిర్భయ దోషుల ఉరి అమలుకు లైన్ క్లీయర్

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి