ఒకే అటెంప్ట్తో.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు చేరిన నీరజ్ చోప్రా

ఒకే అటెంప్ట్తో.. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు చేరిన నీరజ్ చోప్రా

ఇండియన్ డిఫెండింగ్ చాంపియన్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ఫైనల్కు చేరుకున్నాడు.  టోక్యోలో జరుగుతున్న ఈవెంట్ లో  5వ రోజు  బుధవారం (సెప్టెంబర్ 17) జావెలిన్ త్రో గేమ్స్ లో ఫైనల్ కు అర్హత సాధించాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫైనల్ బెర్త్ కన్ ఫాం చేసుకోవడం స్పెషల్. 

ఈ ఈవెంట్ లో ఫస్ట్ అటెంప్ట్ లోనే 84.86 మీటర్లు విసిరి ఫైనల్ లో ప్లేస్ కన్ ఫాం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఫైనల్ కు క్వాలిఫై అవ్వాలంటే 84.50 మీటర్లు విసరాల్సి ఉండగా.. ఒకే ప్రయత్నంలో అంతకంటే ఎక్కువ దూరం విసిరి క్వాలిఫై అయ్యాడు. 

అయితే జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ జావెలిన్ త్రో ను 87.12 మీటర్ల దూరం విసిరి ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేశాడు. ఫస్ట్ అటెంప్ట్ లో ఫౌల్ అయిన వెబర్.. సెకండ్ అటెంప్ట్ లో అధిక దూరం విసిరి నీరజ్ చోప్రాను సెకండ్ ప్లేస్ కు పంపించాడు. 

నీరజ్ గ్లోబల్ చాంపియన్ షిప్ కు క్వాలిఫై కావడం ఇది వరుసగా 5వ సారి. వరల్డ్ నెంబర్ 2 గా ఉన్నాడు చోప్రా. 2022 వరల్డ్ చాంపియన్షిప్ లో సిల్వర్ మెడల్ గెలుపొందడంతో.. ఇండియా నుంచి మొదటి సిల్వర్ మెడలిస్ట్ గా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా 2023 లో బుడాపెస్ట్ లో జరిగిన ఈవెంట్ లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించాడు.