నీరవ్‌‌ ఆర్థిక నేరస్తుడు

V6 Velugu Posted on Dec 06, 2019

ప్రకటించిన ముంబై స్పెషల్‌‌ కోర్టు

ముంబై: వజ్రాల వ్యాపారి, పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ (పీఎన్‌‌బీ)కి కోట్లు ఎగొట్టి లండన్‌‌ పారిపోయిన నీరవ్‌‌ మోడీకి ముంబై స్పెషల్‌‌ కోర్టు షాక్‌‌ ఇచ్చింది. నీరవ్‌‌ మోడీని ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించింది. ఆస్తుల జప్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. విజయ్‌‌ మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా డిక్లేరైన రెండో బిజినెస్‌‌మ్యాన్‌‌ నీరివ్‌‌మోడీనే.

ఈడీ చెప్పినట్టుగా తనను ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించొద్దని నీరవ్‌‌ స్పెషల్‌‌ పీఎమ్‌‌ఎల్‌‌ఏ కోర్టులో పిటిషన్‌‌ వేశారు. దానిపై ఈడీ వాదనలతో ఏకీభవించిన జడ్జి వి.సి. బర్డే నీరవ్‌‌ను ఆర్థిక నేరస్తుడి గా ప్రకటించారు. పీఎన్‌‌బీకి వేల కోట్ల డబ్బును ఎగ్గొట్టిన కేసులో నీరవ్‌‌ మోడీ, ఆయన మామ మెహుల్‌‌ చోక్సీలు నిందితులుగా ఉన్నారు. ఆ స్కామ్‌‌ బయటకు రాకముందే ఇద్దరూ దేశం విడిచి వెళ్లిపోయారు. నీరవ్‌‌ ప్రస్తుతం లండన్‌‌లోని జైల్‌‌లో ఉన్నారు.

మరిన్ని వార్తల కోసం

Tagged Financial, Nirav Modi, criminal

Latest Videos

Subscribe Now

More News