
హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ప్రశాంతంగా ముగిసింది. 95 శాతం మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు హాజరయ్యారు. నిరుటితో పోలిస్తే, ఈసారి పేపర్ టఫ్‌గా వచ్చిందని స్టూడెంట్స్ అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్ ఈజీగా, బోటనీ, జువాలజీ టఫ్ ఉందని చెప్పారు. ప్రశ్నలు అన్నీ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచే వచ్చాయన్నారు. జనరల్ కేటగిరీలో 135 నుంచి 140 మధ్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో 105 నుంచి 110 మధ్య కటాఫ్ ఉంటుందని కోచింగ్ సెంటర్లు అంచనా వేశాయి. ఎప్పటిలాగే కఠినమైన నిబంధనలతో స్టూడెంట్లు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్‌లో పహడిషరీఫ్‌లో సెంటర్ ఉంటే, హయత్‌నగర్ అడ్రస్‌తో హాల్ టికెట్లు వచ్చాయి. దీంతో స్టూడెంట్స్, ఉరుకులు, పరుగులు పెట్టారు. అయినా, సమయానికి చేరుకోలేక సుమారు 50 మంది విద్యార్థులు ఎగ్జామ్‌కు దూరమయ్యారు.