
నీట్, జేఈఈ-2022 ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసం ‘కోటా’ స్టడీ మెటీరియల్ సిద్ధం చేశామని ఐఐటీ, జేఈఈ, నీట్ ఫోరం వెల్లడించింది. ఈ మేరకు ఆ ఫోరం సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్, రాపిడ్ నోట్స్, మాక్ టెస్టులు, వీడియో లెక్చర్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, మాడ్యూల్స్‌ను సిద్ధం చేశామని తెలిపింది. ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారంతో నీట్, జేఈఈ డిజిటల్ పీడీఎఫ్ మొబైల్ వెర్షన్ రూపంలో ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం వాటిని సిద్ధం చేశామని చెప్పింది. విద్యార్థులు ఎగ్జామ్ లో ప్రతిభ కనబర్చేందుకు ఉపయోగపడుతాయని వెల్లడించింది. మరింత సమాచారం కోసం నీట్ అభ్యర్థులు NEET 2022, JEE అభ్యర్థులు JEE 2022 అని టైపు చేసి 98490 16661 వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని ఫోరం సూచించింది.