- ప్రొవిజనల్ రిజల్ట్ అభ్యంతరాల గడువు
హైదరాబాద్, వెలుగు: నీట్ పీజీ–-2025 కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ప్రొవిజనల్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ప్రొవిజనల్ ఫలితాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే, అభ్యర్థులు ఫిబ్రవరి 22 ఉదయం 11 గంటల లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
అభ్యంతరాలను mccresultquery@gmail.com అనే ఇ మెయిల్ ఐడీకి పంపించాలని సూచించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఎంసీసీ ‘ఫైనల్ రిజల్ట్’ను విడుదల చేస్తుంది.
