నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా

నీట్ పీజీ ఎగ్జామ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్, ఫలితాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. ఎగ్జామ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఎగ్జామ్‌‌ను వాయిదా వేస్తున్నందుకు క్షమించాలని విద్యార్థులను కోరింది.