నీట్- సూపర్ స్పెషాలిటీ –2025 ఫలితాలు విడుదల : ఎన్బీఈఎంఎస్

నీట్- సూపర్ స్పెషాలిటీ –2025 ఫలితాలు విడుదల : ఎన్బీఈఎంఎస్
  •     రేడియాలజీలో ఫస్ట్, సెకండ్ ర్యాంకుల్లో తెలుగువాళ్లే

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ సూపర్ స్పెషాలిటీ–2025 ఫలితాలను ఎన్బీఈఎంఎస్ శుక్రవారం విడుదల చేసింది. ఈ  ఫలితాలను  https://natboard.edu.in  వెబ్‌‌‌‌ సైట్‌‌ లో చెక్  చేసుకోవచ్చు. ఇండివిడ్యువల్ స్కోర్ కార్డులు ఫిబ్రవరి 2 నుంచి అందుబాటులో ఉంటాయని, అవి 6 నెలల వరకు మాత్రమే సైట్‌‌లో ఉంటాయని బోర్డు స్పష్టం చేసింది. 

50వ పర్సంటైల్ ఆధారంగా క్వాలిఫైయింగ్ మార్కులను నిర్ణయించగా.. ఇందులో మెడికల్ గ్రూప్ కటాఫ్ 225, సర్జికల్ గ్రూప్ 288, పీడియాట్రిక్ 271, అనస్తీషియాలజీ 284 మార్కులుగా ఖరారు చేశారు. ర్యాంకుల టై ఏర్పడినప్పుడు అభ్యర్థుల ఎంబీబీఎస్ మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.

నీట్ ఎస్‌‌‌‌ఎస్ ఫలితాల్లో మెరిసిన మనోళ్లు...

నీట్ సూపర్ స్పెషాలిటీ ఫలితాల్లో మన తెలుగు డాక్టర్లు సత్తా చాటారు. విశాఖ ఏఎంసీలో ఎంబీబీఎస్ (2015 బ్యాచ్), ఉస్మానియాలో ఎండీ రేడియో డయాగ్నోసిస్ (2022 బ్యాచ్) పూర్తి చేసిన డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ బి.రాణి సౌమిత్రి రేడియాలజీలో మొదటి, రెండో ర్యాంకులు సాధించారు. సూపర్ స్పెషాలిటీలో సీట్లు సాధించిన ఈ ఇద్దరికి ఐఎంఏ హైదరాబాద్ సిటీ బ్రాంచ్ సోషల్ మీడియా చైర్మన్ డాక్టర్ అర్జున్ అభినందనలు తెలిపారు.