నెగెటివ్ కామెంట్స్ బాక్స్​ని కొన్ని రోజులు డిజేబుల్ చేయొచ్చు

నెగెటివ్ కామెంట్స్ బాక్స్​ని కొన్ని రోజులు డిజేబుల్ చేయొచ్చు

కంటెంట్ క్రియేటర్స్​ యూట్యూబ్​ ఛానెల్​లో పెట్టే వీడియోల్ని లైక్​ చేయడమే కాకుండా ‘చాలా బాగుంది. కాన్సెప్ట్ సూపర్’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు వ్యూయర్స్. కొందరేమో నెగెటివ్​ ​ కామెంట్లు పెడతారు. కంటెంట్ క్రియేటర్స్​ని తిట్టిపోస్తారు కూడా. దాంతో  ‘కామెంట్​ బాక్స్​ లేకుంటే బాగుండు’ అనుకుంటారు వీళ్లు.  అలాంటప్పుడు  ఏ వీడియోలకు నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయో వాటి కామెంట్ బాక్స్​ని కొన్ని రోజులు డిజేబుల్ చేసుకోవచ్చు. అందుకోసం... యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి, కంటెంట్ బటన్ నొక్కాలి. వీడియోల్లో నెగెటివ్ కామెంట్స్ వచ్చే వీడియోల్ని సెలక్ట్​ చేసుకొని కామెంట్ ఆప్షన్​ని డిజేబుల్ చేయాలి.