ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్

ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లు ఉండొద్దు : రాజేంద్ర విజయ్
  • పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు రాజేంద్ర విజయ్

ఆసిఫాబాద్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల సాధారణ పరిశీలకుడు రాజేంద్ర విజయ్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ సురేశ్ కుమార్, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులకు 8523876384 నంబర్​ను సంప్రదించాలని సూచించారు. లేదా ఆదిలాబాద్ లోని పెన్ గంగ అతిథి గృహంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 వరకు ప్రతిరోజు ఫిర్యాదులు ఇవ్వొచ్చని చెప్పారు. పారదర్శక ఎన్నికల కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎన్నికల సామగ్రిని భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ సందర్శించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. స్వీప్ ఆక్టివిటీ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ దేశ్ పాండే, అధికారులు పాల్గొన్నారు.