
మెదక్ టౌన్, వెలుగు: మెదక్ జిల్లాలో పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేశారని నలుగురు సర్పంచులు, ఐదుగురు పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్ హరీశ్ సోమవాం షోకాజ్ నోటీసులు జారీచేశారు. పల్లెప్రగతిలో భాగంగా కలెక్టర్ హరీశ్, డీఆర్డీవో శ్రీనివాస్ సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చిన సూచనలు, విధి విధానాలు పాటించని పెద్దశంకరంపేట మండలం ఆరేపల్లి, పెద్దశంకరంపేట సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్, టేక్మాల్ మండలం పాల్వంచ సర్పంచులు, కార్యదర్శులు, కొల్చారం మండలం రంగంపేట పంచాయతీ కార్యదర్శికి సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.