కొండగట్టు ఆలయ అధికారుల నిర్లక్ష్యం

కొండగట్టు ఆలయ  అధికారుల నిర్లక్ష్యం

కొండగట్టు, వెలుగు: కొండగట్టు ఆలయ చరిత్రలోనే అతి పెద్ద దొంగతనం జరిగినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఆలయానికి భద్రత విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొండగట్టు ఆలయంలో కొద్ది రోజుల క్రితం వరుస దొంగతనాలు జరిగాయి.  దీంతో ఎండోమెంట్,  పోలీసులు ఆలయానికి వచ్చే భక్తుల పైన నిఘా పెట్టాలని సీసీ కెమెరాలు,  నాలుగు ఫుల్ బాడీ స్కానర్లు కొనుగోలు చేశారు.  లక్షలు వెచ్చించి కొన్న ఫుల్ బాడీ స్కానర్లను మూలన పడేశారు.  దీని వల్ల భక్తుల ముసుగులో ఎవరు వస్తున్నారనేది తెలియడం లేదు.  బాడీ స్కానర్లు అంజన్న చిన్న జయంతి సమయంలోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని పక్కన పెట్టారు.  జయంతి అనంతరం స్కానర్లు ఏర్పాటు చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు స్పందించి బాడీ స్కానర్లు వినియోగంలోకి తీసుకురావాలని భక్తులు కోరుతున్నారు.