మూసీపై బ్రిడ్జిల నిర్మాణానికి అధికారుల నిర్లక్ష్యం 

మూసీపై బ్రిడ్జిల నిర్మాణానికి అధికారుల నిర్లక్ష్యం 
  • జంట జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు మంత్రుల హడావుడి
  • ఆ తర్వాత అంతే సంగతి
  • ఇంత వరకు ఫైనల్ కాని డీపీఆర్

హైదరాబాద్, వెలుగు:  మూసీ నదిపై కొత్త బ్రిడ్జిల నిర్మాణం ఎప్పటికప్పుడు ప్రకటనలకే పరిమితం అవుతోంది. పరిపాలన అనుమతులు వచ్చి 8 నెలలు దాటినా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. మొత్తం15 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉండగా వీటిలో అత్యవసరమైన మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిలను ముందుగా నిర్మిస్తామని, 10 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని నెల కిందట మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ ప్రకటించారు. కానీ ఇంతవరకు అతీగతి లేదు. నేటికీ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్​లు రెడీ కాలేదు. రూ.94 కోట్లతో రెండు బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు చెప్పి పనులు చేపట్టలేదు. కేవలం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన టైంలో పాతబ్రిడ్జిల వద్ద హడావుడి చేసి వెళ్లిపోయారు. భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ రెండు బ్రిడ్జిలను రోజుల తరబడి క్లోజ్​ చేస్తున్నారే కానీ ఎత్తు పెంచి కొత్తవి 
నిర్మించడం లేదు. ఫలితంగా వానల టైంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది.

సవాల్​గా మారిన భూసేకరణ

ఓ కారణమైతే భూసేకరణ పెద్ద సవాల్​గా మారింది.హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్​డీసీఎల్) పర్యవేక్షించనున్నప్పటికీ నిర్మాణానికి అయ్యే ఖర్చును హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ భరించాల్సి ఉంది. కానీ ఇంతవరకు భూసేకరణ పూర్తి కాలేదు. దీంతో 3 డిపార్టమెంట్ల అధికారులు వీటి నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు మొదట్లో హడావుడి చేసినప్పటికీ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో అంతటితోనే వదిలేశారు. కాగా మూసీ, ఈసీ నదులపై ప్రజలకు ఇబ్బందులు అయ్యేచోట రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలను  నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 
15 బ్రిడ్జిల్లో మూసారాంబాగ్, చాదర్ ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్ ప్రాంతాల్లో రూ.168 కోట్లతో జీహెచ్ఎంసీ, మిగతా 11 చోట్ల రూ.377 కోట్ల ఫండ్స్​ని హెచ్ఎండీఏ ఖర్చు చేయాల్సి ఉంది.