పోలింగ్ రోజు.. జూ పార్కు కూడా మూసివేత

పోలింగ్ రోజు.. జూ పార్కు కూడా మూసివేత

తెలంగాణ ఎన్నికల దృష్ట్యా నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నవంబర్ 30న మూసివేయనున్నారు.  తెలంగాణ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  హైదరాబాద్​ లో పిల్లలకు సెలవస్తే చాలు.. ట్యాంక్​ బండో.. గోల్కొండ ఖిల్లాకు కాని.. జూపార్క్​ కు కాని  తీసుకెళ్లాలని పేరెంట్స్​ ను సతాయిస్తుంటారు.  ఒక్కోసారి స్కూలు యాజమాన్యాలే  ప్లాన్​ చేస్తుంటాయి.  అయితే తెలంగాణలో నవంబర్​ 30న ఎన్నికలు జరుగుతాయి.  దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ప్రకటించింది.  ఇక ఆరోజు జూ ఆపార్క్​కు వెళ్లి ఎంజాయి చేద్దామనుకొనే పిల్లలకు నిరాశ ఎదురైంది.  నవంబర్​ 30 జూపార్క్​ కు అధికారులు సెలవు ప్రకటించారు.

నవంబర్​ 30న తెలంగాణలో ఎన్నికలు కాన ఆ రోజు తెలంగాణ ఉద్యోగులకు, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  సెలవు ఇవ్వని  ప్రైవేట్​ కంపెనీలపై , ఐటీ కంపెనీల  యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ కమిషనర్‌ను  తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ఆదేశించారు.