
న్యూఢిల్లీ: కరోనాతో భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంది ఆమె.. దీనికి తోడు కొడుకుపై పక్కింటి వారి కంప్లయింట్స్మరింత బాధ పెట్టాయి. ‘మీ అబ్బాయి అల్లరి ఎక్కువైంది.. అది చేస్తున్నాడు.. ఇది చేస్తున్నాడు’ అంటూ పదే పదే గొడవ చేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై పిల్లాడితో సహా అపార్ట్మెంట్12వ అంతస్తు నుంచి దూకింది. ముంబయికి చెందిన రేష్మా ట్రెంచిల్(44), శరత్ ములుకుట్ల భార్యాభర్తలు. వీరికి ఏడేళ్ల బాబు ఉన్నాడు. చాందివలిలో ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. శరత్ మే 23న కరోనాతో చనిపోయాడు. అప్పటి నుంచి భర్త పోయిన బాధతో రేష్మ ఇంట్లోనే ఉంటోంది. మీ అబ్బాయి విపరీతంగా అల్లరి చేస్తున్నాడని అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్ల వాళ్లు పదే పదే కంప్లయింట్స్ చేయడంతో రేష్మ ఈ నెల 21న అపార్ట్మెంట్ 12వ అంతస్తు నుంచి కొడుకుతో సహా దూకి చనిపోయింది. ఈ ఘటనకు సంబంధించి పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో ఒకరిని అరెస్ట్ చేశారు.