'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మాస్ ట్రైలర్

'నేను మీకు బాగా కావాల్సినవాడిని' మాస్ ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన ప్రస్తుతం నటించిన చిత్రం 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. కోడి దివ్య ఈ సినిమాను నిర్మించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంచ్ చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.


ట్రైలర్ విషయానికొస్తే.. 'కాస్ట్యూమ్స్ .. కళ్లజోడు చూస్తే అర్థం కావడం లేదూ.. మనం ఊరమాస్' అంటూ తన కేరక్టర్ గురించి కిరణ్ ఇచ్చిన ఇంట్రడక్షన్ ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో కిరణ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడనే విషయం అర్థమవుతోంది. ప్రేమ.. పెళ్లి.. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన డ్రామాతో ఈ సినిమా నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఇందులో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కీలకమైన పాత్రను పోషించారు.

ఇక ఈ సినిమాకి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అకట్టుకునే సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి కిరణ్ స్వయంగా స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందించడం విశేషం.ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.