ఎవరెస్ట్‌‌ వద్ద కూలిన హెలికాప్టర్...ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, పైలట్ మృతి

ఎవరెస్ట్‌‌ వద్ద కూలిన హెలికాప్టర్...ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, పైలట్ మృతి

కాఠ్మండు : ఎవరెస్ట్ శిఖరం దగ్గర్లో ప్రైవేటు హెలికాప్టర్‌‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మెక్సికన్లు, పైలట్‌‌ చనిపోయారు. ‘‘మంగళవారం ఉదయం 10.04 సమయంలో సోలుఖుంభు జిల్లాలోని సుర్కే ఎయిర్‌‌‌‌పోర్ట్ నుంచి కాఠ్మండుకు మనాంగ్‌‌ ఎయిర్‌‌‌‌ ఎన్‌‌ఏఎంవీ చాపర్‌‌‌‌ టేకాఫ్‌‌ తీసుకుంది. అయితే 10.13 సమయంలో 12 వేల అడుగుల ఎత్తులో ఉండగా.. కాంటాక్ట్‌‌ కోల్పోయింది” అని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్(టీఐఏ) మేనేజర్‌‌ జ్ఞానేంద్ర భుల్ చెప్పారు. 

లిఖుపికే రూరల్ మున్సిపాలిటీలోని లాంజురా ఏరియాలో పర్వత ప్రాంతాల్లో చాపర్ కూలినట్లు కొద్దిసేపటి తర్వాత గుర్తించారు. 10.12 సమయంలో చాపర్ చివరి లొకేషన్  లాంజురా పాస్ ఏరియాలో చూపించింది. ఘటనాస్థలిలో కెప్టెన్ ఛేత్ బహదూర్ గురుంగ్, ఐదుగురు మెక్సికన్ ఫ్యామిలీ ఆరు డెడ్‌‌బాడీలను గుర్తించామని టీఐఏ అధికార ప్రతినిధి కేక్‌‌నాథ్ సితావులా చెప్పారు.