నేపాల్ కొత్త ప్రధానిగా ఓలి... నేడు ప్రమాణ స్వీకారం

నేపాల్ కొత్త ప్రధానిగా ఓలి... నేడు ప్రమాణ స్వీకారం

ఖాఠ్మాండు : నేపాల్  కొత్త ప్రధానిగా కమ్యూనిస్ట్  పార్టీ ఆఫ్  నేపాల్ -యూనిఫైడ్  మార్క్సిస్ట్  లెనినిస్ట్ (సీపీఎన్ యూఎంఎల్) చైర్మన్  కేపీ శర్మ ఓలీ నాలుగోసారి నియమితులయ్యారు. ప్రెసిడెంట్  రామ్ చంద్ర పౌడేల్.. రాజ్యాంగంలోని 762 ఆర్టికల్ ను అనుసరించి ఆయనను ప్రధానిగా నియమించారు. రాష్ట్రపతి భవన్  శీతల్ నివాస్‌‌ లో సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

కాగా.. శుక్రవారం ప్రతినిధుల సభలో జరిగిన విశ్వాస తీర్మానం పరీక్షలో పుష్ప కమల్  దహల్  ప్రచండ ఓడిపోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఓలీ ముందుకు వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బలం తమకు ఉందని, పార్లమెంటులో అతిపెద్ద పార్టీ నేపాలీ కాంగ్రెస్  (ఎన్సీ) తమకు మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. తనకు మద్దతు తెలుపుతూ సీపీఎన్ యూఎంఎల్  నుంచి 77 మంది సభ్యులు, ఎన్సీ నుంచి 88 మంది సభ్యులు సంతకం చేసిన పత్రాన్ని రాష్ట్రపతికి ఓలీ సమర్పించారు.