అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నేపాల్ అధ్యక్షురాలు

అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నేపాల్ అధ్యక్షురాలు

నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ఖాట్మండు మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ (TUTH)లో చేరారు. అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆసుపత్రిలో చేరిన ఆమె... ఫ్లూ, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, రిపోర్ట్స్ ఇంకా రావల్సి ఉందని అధికారులు తెలిపారు.

హిమాలయ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలిగా 2015లో ఎన్నికైన భండారి.. 2018లో మరోసారి నియమితులయ్యారు. వచ్చే ఏడాది ఆమె పదవీకాలం ముగియనుంది. భండారీ చివరిసారిగా విజయదశమి రోజు ఆమె అధికారిక నివాసం శీతల్ లోని లాన్ పై కనిపించాపు. అక్కడ ఆమె తన కుటుంబ సభ్యులకు, ఇతరులకు టీకాను, ప్రసాదాన్ని అందించారు.