
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈనెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈవిధమైన పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకూ బీమాను వర్తింపజేసే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు వివరించారు.
దీని ద్వారా రాష్ట్రంలోని దాదాపు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 60 ఏళ్లలోపు వయసున్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడని చెప్పారు. దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం అందిస్తామన్నారు. ఈమేరకు కేటీఆర్ ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.